నేడు కలెక్టరెట్‌లో ప్రజావాణి
BDK: జిల్లా ప్రజల సౌకర్యార్థం సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో కాకుండా డివిజన్ల వారీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలు ఆర్డీవో కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో పాల్గొనాలని ఆయన కోరారు.