కేటీపీఎస్‌లో ప్రమాదం.. ఒకరి మృతి

కేటీపీఎస్‌లో  ప్రమాదం.. ఒకరి మృతి

BDK: పాల్వంచ కేటీపీఎస్ విద్యుత్ కర్మాగారంలో ఐదవ దశ తొమ్మిదవ యూనిట్ టార్భాయిన్ మెయింటెనెన్స్‌లో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదం సంభవించి ఫోర్త్ గ్రేడ్ ఆర్టిజన్ సుబ్బారావు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని చికిత్స కోసం హుటా హుటిన కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.