ఈ నెల19న ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహణ
NLR: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 19న ఉద్యోగుల గ్రీవెన్స్ డేను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం తెలిపారు. ఈనెల 20న నిర్వహించాల్సిన ఉద్యోగుల గ్రీవెన్స్ డేను పరిపాలనా కారణాల వల్ల ఒకరోజు ముందుగానే అనగా ఈనెల 19వ తేదీ ఉదయం 11.00 గంటలకు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.