సీజనల్ వ్యాధుల కట్టడికి కీలక నిర్ణయం

సీజనల్ వ్యాధుల కట్టడికి కీలక నిర్ణయం

NTR: రాష్ట్రంలో సీజనల్ వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆర్టీజీఎస్లోని 'అవేర్' సేవలను వినియోగించుకోనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ఐదేళ్ల గణాంకాలు, వాతావరణ పరిస్థితులను విశ్లేషించి, వ్యాధుల తీవ్రతను ప్రాథమిక దశలోనే గుర్తించడం దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామాలు, సచివాలయాల సిబ్బంది అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు.