అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

W.G: జిల్లాలో తీరప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనపై అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తీరప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనకు సంబంధించిన మూడు అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. నర్సాపురంలోని వశిష్ఠ గోదావరి నది ఒడ్డున ఘన వ్యర్థాలను పారేయడంపై సమీక్షించారు