చిన్న వర్షానికే చెరువులా మారిన పూడూరు రోడ్లు
GDWL: గద్వాల మండలం పూడూరు గ్రామంలోని సావడి పరిసర ప్రాంతాలు స్వల్ప వర్షానికే జలమయమవుతున్నాయి. రోడ్డుపై భారీగా నీరు నిలవడంతో ప్రయాణికులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా, ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం గ్రామ చిన్నారులు వరి నాటు వేశారు.