సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే భేటీ

ATP: సీఎం చంద్రబాబును MLA కాల్వ శ్రీనివాసులు కలిశారు. రబీలో సాగైన పంటకు ఈ క్రాప్ బుకింగ్ కాలేదని వివరించారు. కణేకల్లు మండల పరిధిలోని చిక్కణేశ్వరస్వామి వడియార్ చెరువు కింద రబీ సీజన్‌లో 524 మంది రైతులు 1,486 ఎకరాల్లో వరి పంట సాగుచేసినట్లు తెలిపారు. వీటికి ఈ క్రాప్ కాకపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటం లేదన్నారు.