నేడు కాకినాడలో జాబ్ మేళా

నేడు కాకినాడలో జాబ్ మేళా

కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం 735 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ఇన్నోసోర్స్, శ్రీరాం చిట్స్ వంటి సంస్థల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి, టెన్త్ నుంచి డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈరోజు ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.