సురక్షిత ప్రయాణం.. మనందరి బాధ్యత: కలెక్టర్
KMR: రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తేనే ప్రయాణికులు సురక్షితంగా ఇల్లు చేరుకుంటారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. “ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం-ప్రమాదాలను అరికడదాం" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారా సమాజంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.