హత్య కేసు ఛేదన.. ముగ్గురు నిందితులు అరెస్టు
SS: జిల్లా పోలీసులు కర్ణాటక వాసి హత్య కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి ఛేదించారు. అమడగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య భూమి వివాదాలు, పాత పగ కారణాంగా పథకం ప్రకారం జరిగినట్లు విచారణలో తేలింది. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ప్రత్యేక పర్యవేక్షణలో నల్లమాడ సీఐ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.