VIDEO: కోఠిలో ఆశావర్కర్ల ధర్నా

HYD: కేంద్రం పెంచిన పారితోషికాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోఠిలో గల ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం వెంటనే నిర్ణయించి, పెండింగ్ బకాయిలు చెల్లించాలని వారు కోరారు. ఇన్సూరెన్స్, పదోన్నతులు, పదవీ విరమణ ప్రయోజనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.