ధర్మవరం-నర్సాపూర్ రైళ్లు రద్దు

అన్నమయ్య: ధర్మవరం - నర్సాపూర్ రైళ్లను మంగళవారం నుంచి రద్దు చేశారు. గుంటూరు సమీపంలోని పెద్దవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, చండూరు రైల్వే సెక్షన్లలో మూడో రైలు మార్గం పనులు చేస్తున్నారు. దీంతో నరసాపూర్ నుంచి ధర్మవరానికి నడిచే (17247) రైలును ఈనెల 12వ తేదీ నుంచి ఈనెల 19వ తేదీ వరకు రద్దు చేశారు. ధర్మవరం నుంచి నర్సాపూర్‌కు రైలును సైతం 19వ తేదీ వరకు రద్దు చేశారు.