అసాంఘిక శక్తుల అణచివేతే లక్ష్యంగా విస్తృత తనిఖీలు

VZM: దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలోని ముఖ్య పట్టణాలైన విజయగరం, బొబ్బిలి, రాజాంలలో ఆకస్మికంగా 'స్టేటిక్ స్ట్రేంజర్ చెకింగ్' చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అసాంఘిక శక్తులను అణిచి వేయాలనే లక్ష్యంతో భద్రత చర్యలు చేపట్టామన్నారు.