తమ్మారంలో దాడి ఘటన.. పది మంది నిందితుల అరెస్ట్

తమ్మారంలో దాడి ఘటన.. పది మంది నిందితుల అరెస్ట్

SRPT: చింతలపాలెం మండలం తమ్మారంలో శ్రీకాంత్ రెడ్డిపై భౌతిక దాడికి పాల్పడ్డ పది మంది నిందితులను కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్, రౌడీ షీట్లు తెరుస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.