శ్రీ ఏడుపాలలో దుర్గమ్మకు విశేష పూజలు

శ్రీ ఏడుపాలలో దుర్గమ్మకు విశేష పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవాలయంలో సోమవారం వనదుర్గ భవాని మాతకు ఇందువాసరే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వైశాఖమాసం, శుక్లపక్షం, అష్టమి పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి, సుగంధ పుష్పాలతో అలంకరించి హారతి సమర్పించారు.