VIDEO: మాజీ మంత్రికి తప్పిన పెనుప్రమాదం
అన్నమయ్య: మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం తప్పింది. పట్టణంలోని ఎస్టేట్ ప్రాంతంలోని కరెంటు ఆఫీస్ వద్ద మూడు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. కాన్వాయ్‌లో ఉన్న యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారుకు నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.