విద్యార్థినుల నిజాయితీని అభినందించిన జిల్లా ఎస్పీ
TPT: వెంకటగిరి జడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థినులు రోడ్డుపై దొరికిన సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన పర్సును వెంకటగిరి పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితులను గుర్తించి వాటిని వారికి అందజేశారు. విద్యార్థినుల నిజాయితీని అభినందించిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు వారికి ప్రశంసాపత్రాలు, పుస్తకాలు, నగదు బహుమతులు అందజేశారు.