రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు ఆర్డీఎఫ్ విద్యార్థినుల ఎంపిక

WGL: పర్వతగిరి మండలంలోని ఆర్డీఎఫ్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కళాశాల నుంచి 10 మంది విద్యార్థినులు పాల్గోనగా 400 మీటర్ విభాగంలో ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఏ.జనార్థన్ తెలిపారు.