'బీఆర్ఎస్ నిరుద్యోగులకు అండగా నిలబడుతుంది'

సిరిసిల్ల: హైకోర్టు తీర్పును అమలు చేయాలని ధర్నా చేసిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ నిరుద్యోగులకు అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు.