అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న రాష్ట్రం

KMM: ఖమ్మం VDO'S కాలనీలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఖమ్మం నగర మేయర్ నీరజ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ జాతీయ జెండాను ఎగరవేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు.