శానిటేషన్ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

ATP: గుంతకల్లులోని వార్డుల్లో మంగళవారం చేస్తున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. టీ షాప్ నిర్వాహకులకు రోడ్డుమీద చెత్తను వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.