ఉద్యోగులు 5 నిమిషాలు మౌస్ ముట్టుకోకుంటే..!
తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల పనితీరుపై పలు ఐటీ కంపెనీలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ల్యాప్ ట్యాప్‌ల మౌస్ గానీ, కీబోర్డు గానీ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇన్-యాక్టివ్‌గా ఉంటే ఆ ఉద్యోగి ఖాళీగా ఉన్నట్లు, 15 ని. కంటే ఎక్కువ సేపు ఉంటే వేరే పనిలో నిమగ్నమైనట్లు పరిగణిస్తున్నాయని ఆంగ్ల మీడియా తెలిపింది. అయితే దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.