దెబ్బతిన్న తూము.. వృథాగా నీరు
NLR: ఉలవపాడు(మం) వీరేపల్లిలోని పెద్ద చెరువు తూము చెక్క దెబ్బతినడంతో నీరు వృథాగా పోయింది. బుధవారం రైతులు నీటి కోసం చాయిన్ కదిలించగా ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన ఇరిగేషన్ అధికారులు ఇసుక బస్తాలతో నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నారు. ఈ చెరువు కింద సుమారు 400 ఎకరాల పంట సాగులో ఉంది.