ఆకట్టుకున్న విద్యార్థుల బ్యాండ్ షో

ఆకట్టుకున్న విద్యార్థుల బ్యాండ్ షో

VZM: మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా విజయనగరం పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ జంక్షన్, రాజీవ్ స్టేడియం వద్ద పాఠశాల విద్యార్థులతో శనివారం ప్రత్యేక బ్యాండ్ షో నిర్వహించారు. ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు విజయనగరం 2వ పట్టణ పోలీసులు ఈ కార్యక్రమం జరిపించారు. మహిళల గౌరవం, భద్రత, సమానత్వంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.