నాటుబాంబు పేలి మహిళ చేతికి గాయం

TPT: నాటుబాంబు పేలి ఓ మహిళ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. నాగలాపురం మండలం సురుటుపల్లి పంచాయతీలోని కస్తూరినాయుడు కండ్రిగ సమీపంలో ఉపాధి పనులు చేస్తున్నారు. పనులు చేస్తుండగా ఒక్కసారిగా నాటుబాంబు పేలింది. ఘటనలో మహిళా చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న వారు ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.