కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా హీరో సుమన్ ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా హీరో సుమన్ ప్రచారం

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని కృష్ణానగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా హీరో సుమన్ శనివారం ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.