సజావుగా ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్
MDK: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శివంపేటలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన ఆయన, అక్కడ కల్పించిన సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.