'బలగం' నటుడికి అనారోగ్యం.. దాతల కోసం ఎదురుచూపు

'బలగం' నటుడికి అనారోగ్యం.. దాతల కోసం ఎదురుచూపు

'బలగం' సినిమాలో నటించిన గుడిబోయిన బాబు(జీవి బాబు) కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఆ చిత్రంలో కొమరయ్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందారు. అయితే, ప్రస్తుతం ఆయన వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎవరైనా దాతలు స్పందించి సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.