గ్యాస్ ఏజెన్సీకి జరిమానా విధించండి: కలెక్టర్
CTR: గ్యాస్ సిలిండర్ కు అధిక ధర వసూలు చేసిన పుంగనూరులోని వీరభద్ర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి రూ. 10వేల జరి మానా విధించాలని డీఎస్వో శంకరన్ ను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గ్యాస్ పంపిణీ పై ప్రభుత్వం చేపట్టినIVRS లో పలువురు గ్యాస్ ఏజెన్సీ పై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ చర్యలు చేపట్టారు. మరోసారి జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.