కలెక్టరేట్ ఎదుట కేఎంసి హాస్టల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కెఎంసి హాస్టల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు నేడు ఆందోళన నిర్వహించారు. హాస్టల్ వర్కర్స్‌కు 8 నెలలుగా రావలసిన పెండింగ్ జీతాలను మంజూరు చేయాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి యాద నాయక్ ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ ప్రావిణ్యకు వినతిపత్రం అందించారు.