'మద్యం తాగి వాహనాలు నడపొద్దు'
VZM: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సీఐ సూరి నాయుడు సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విజయనగరంలోని వివిధ జంక్షన్లలో వాహనదారులకు గురువారం అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడపొద్దన్నారు.