ఆలయ అభివృద్ధికి రూ. 1.81 కోట్ల నిధులు మంజూరు
ప్రకాశం: మర్రిపూడి కొండపై ఉన్న పృదులగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ. కోటి 81 లక్షల మంజూరైనట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రేగుల వీరనారాయణ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడినట్లు తెలిపారు. ఇప్పటికే కొండపై ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్ల నిధులు మంజూరైన విషయం విదితమే.