అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

E.G: కడియం మండలం వేమగిరిలోని పాడుపడిన ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ క్వార్టర్స్‌లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు శవాన్ని పరిశీలించి, రాళ్లతో తలపై కొట్టి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వేమగిరి VRO ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనకు సంబధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.