'నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలే లక్ష్యం'
KKD: రాజమండ్రి నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తోందని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. సోమవారం సింహాచల నగర్‌లో రూ. 32 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రెయిన్లను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.