రోజంతా ఆఫీసు పనుల్లో అలసిపోతున్నారా?

రోజంతా ఆఫీసు పనుల్లో అలసిపోతున్నారా?

AKP: ఈ వేసవిలో మండుతున్న ఎండలకు శరీరం త్వరగా అలసట చెందుతుంది. అయితే, రోజంతా ఆఫీసు పనుల్లో బిజీగా ఉండే వాళ్లకి సాయంత్రం వాక్ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. సూర్యాస్తమయం సమయంలో చల్లటి గాలికి నడవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. అవి ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచడానికి దోహదపడుతాయి. అలాగే, సాయంత్రం వాక్ వల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.