సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

WNP: తెల్లరాళ్లపల్లి తాండలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావుకు జిల్లా గిరిజన సంఘం కార్యదర్శి బాల్య నాయక్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాల్య నాయక్ మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు, మూతపడిన ప్రాథమిక పాఠశాలను తెరిపించాలని, మహిళా సంఘం బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్ మంజూరు చేయాలని కోరారు.