ఢిల్లీలో కూలిన వంతెన.. మహిళ మృతి
ఢిల్లీలోని రూప్ నగర్ ప్రాంతంలో భారీ ప్రమాదం జరిగింది. సుమారు 60 అడుగుల పొడవున్న ఐరన్ ఫుట్ బ్రిడ్జ్ ఒక్కసారిగా మురికి కాలువలో కుప్పకూలింది. ఈ ఘటనలో వంతెన కింద ఉన్న 50 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాలువలో గాలింపు చేపట్టి మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు.