రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

MDK: తూప్రాన్ పట్టణ పరిధి హైవే బైపాస్‌‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్రె మైసయ్య (54) మృతి చెందినట్లు ఎస్సై శివానందం తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన మైసయ్య బైపాస్‌లోని దారువాల బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. పనులు ముగించుకొని నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు.