కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
TPT: వరదయ్యపాలెం మండల కేంద్రంలోని మర్కస్ మజీద్‌లో నిర్వహించిన ఇఫ్తియార్ విందులో తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన తర్వాత, ముస్లిం సోదరులు ఇచ్చిన విన్నతులను స్వీకరించారు. ఈ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.