నేడు బీజేపీ భారీ బహిరంగ సభ

నేడు బీజేపీ భారీ బహిరంగ సభ

AP: విశాఖపట్టణంలోని రైల్వే మైదానంలో ఇవాళ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్‌ 'సారథ్యం' పేరుతో చేపట్టిన యాత్రకు ఇది ముగింపు సభ. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నిన్న రాత్రి నడ్డా నగరానికి చేరుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు సభకు తరలిరానున్నట్లు సమాచారం.