ఇన్నోవేషన్ మేళాలో విద్యార్థి ప్రతిభ
Srcl: జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి ఇన్నోవేషన్ మేళాలో చందుర్తి మండలం జోగాపూర్ హైస్కూల్‌లో 10 తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీవిన్ గురువారం ప్రథమ స్థానంలో నిలిచి జ్ఞాపిక, ప్రశంస పత్రం అందుకున్నాడు. గైడ్ టీచర్ అంజయ్య నేతృత్వంలో స్థిరమైన వ్యవసాయంలో యంత్రాన్ని తయారుచేసి ప్రదర్శించినందుకు (సుస్థిర వ్యవసాయం) అనే ఉప అంశంలో బహుమతి లభించిందని శ్రీవిన్ పేర్కొన్నాడు.