VIDEO: కేరళ అయ్యప్పను ఆకట్టుకున్న కడియపులంక పూల మాల
E.G: శబరిమలైలో జరిగిన అయ్యప్ప స్వామి ఆరాట్టు కార్యక్రమంలో కడియం మండలం కడియపులంక శ్రీ రామాంజనేయ ఫ్లవర్ మర్చంట్ యజమాని ఆకుల భాస్కరరావు తీసుకెళ్ళిన పూల మాలను స్వామి వారికి అలంకరించారు. గజరాజుపై స్వామివారి గ్రామోత్సవంలో ఈ పూలమాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుపు, పచ్చని పూలతో తయారు చేయించి తీసుకెళ్లిన ఫూలమాల శబరిమల ఆలయ పూజారులను విశేషంగా ఆకట్టుకుంది.