VIDEO: సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ
SRPT: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేశ్ చారి తన ప్రతిభను చాటారు. కేవలం అంగుళం పరిమాణమున్న సుద్దముక్కపై పూలే ప్రతిమను అత్యంత కళాత్మకంగా చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో బియ్యం గింజలు, పెన్సిల్ మొనలపై అద్భుత కళాఖండాలు సృష్టించి మన్ననలు పొందిన నరేష్‌ను స్థానికులు అభినందిస్తున్నారు.