ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో నేడు వేలంపాట

BDK: భద్రాచలం పట్టణంలోని యక్షి శాఖ కార్యాలయంలో వాహనాల వేలం పాట నేడు జరుపుతున్నట్లు ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ షేక్ రహీమున్నీసా బేగం ప్రకటించారు. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు ఉదయం 10 గంటల నుంచి కార్యాలయం ఆవరణలో వేలంపాట ప్రారంభమవుతుందని అన్నారు. కావున ఈ వేలం పాటలో స్వచ్ఛందంగా పాల్గొనాలని అధికారులు తెలిపారు.