సీఐ శ్రీనివాసరావుకు ఉత్తమ అవార్డు

WGL: వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావుకు ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు వరంగల్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందించారు.