నియోజకవర్గ ఆలయాల అభివృద్ధికి టీటీడీ సాయం
TPT: తిరుమల ఛైర్మన్ క్యాంప్ ఆఫీసులో టీటీడీ ఛైర్మన్ నాయుడుని చంద్రగిరి MLA పులివర్తి నాని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని ఆయన కోరారు. సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ ఆలయాల అభివృద్ధికి పూర్తి సహాయాన్ని అందిస్తామన్నారు. ఇందుకు MLA పులివర్తి నాని ఛైర్మన్ నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు.