పుట్టపర్తికి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
SS: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 22న శనివారం పుట్టపర్తికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. పర్యటన విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ప్రశాంతి నిలయంలో ఆమె ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.