'బాలికల వసతి గృహంలో నాసిరకం ఆహారం'

'బాలికల వసతి గృహంలో నాసిరకం ఆహారం'

KDP: ఆదివారం ఉదయం కడప జిల్లా పులివెందులలోని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వసతులు, భోజన నాణ్యత,మౌలిక సదుపాయాల నిర్వహణలో తీవ్రమైన లోపాలను ఆయన గమనించారు. విద్యార్థులకు నాసిరకం కోడిగుడ్లు, నాణ్యత లేని పాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి, అధికారులను కఠినంగా హెచ్చరించారు.