భూ కబ్జాలపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం

NDL: శ్రీశైలం ప్రాజెక్టులోని భూ కబ్జాలపై కలెక్టర్ రాజకుమారి పంచాయతీ రాజ్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ కార్యాలయంలో భూ కబ్జాలపై పలువురు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఆక్రమణలు కొనసాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఎన్ని రోజుల్లోగా ఆక్రమాలకు సంబంధించిన నివేదికలు అందజేస్తారని అడగగా.. వారంలోగా నివేదిక ఇస్తామని సంబంధిత అధికారులు అన్నారు.