నేడు ఆక్వా సాగుపై రైతులకు శిక్షణ

W.G: ఆక్వా సాగులో సాంకేతిక పరిజ్ఞానం, మెలకువలు, మెరుగైన ఆక్వాసాగు విధానాలపై ఉండిలో నేటి(మంగళవారం) నుంచి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎఫ్ఎవో రాంబాబు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ నాగరాణి ప్రారంభిస్తారని అన్నారు. ఆసక్తి గల ఆక్వా రైతులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.